
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
నిజామాబాద్ నాగారం: ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి అన్నారు.వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సోమవారం మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రుక్మిణి ఛాంబర్స్ నుంచి ఖిల్లా చౌరస్తా వరకు 2కే వాకథాన్‌ను నిర్వహించారు.ఈకార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.ఇలాంటి వాక్‌లు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఉపయోగపడతాయన్నారు.కార్డియాలజిస్టులు స దానంద రెడ్డి, సందీప్‌రావులు మాట్లాడుతూ నిద్రలే మి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడంతో యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయి. కార్యక్రమంలో డాక్టర్లు జగదీష్ చంద్ర బోస్, వారిస్ అలీ, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్యకరమైన జీవన విధానం
అలవర్చుకోవాలి
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలని కార్డియాలజిస్టు, రొటీరియన్ సందీప్ రావు పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్బంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని సత్యా ఒకేషనల్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పౌష్టిక ఆహారం తీసుకోవాలని, వ్యాయామం చేయాలని, రెగ్యులర్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు, క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, సభ్యులు చంద్రశేఖర్, గిరిష్ కుమార్, గౌరీ శంకర్, ప్రిన్సిపల్, లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.