
పోయిరావమ్మా గౌరమ్మ
● ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుక
● ఉత్సహంగా గడిపిన మహిళలు
సిరికొండ/నిజామాబాద్ రూరల్/డిచ్‌పల్లి/సుభాష్‌నగర్/ధర్పల్లి/నిజామాబాద్ అర్బన్/జక్రాన్‌పల్లి: నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో పండుగ జరుపుకున్నారు.ఆయా గ్రామాల శివారుల్లో గల చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకుని ముత్తైదువుల ఆశీర్వాదాలను అందుకున్నారు.
కన్యకాపరమేశ్వరి ఆలయంలో వివిధ రకాల బతుకమ్మలు

పోయిరావమ్మా గౌరమ్మ

పోయిరావమ్మా గౌరమ్మ

పోయిరావమ్మా గౌరమ్మ

పోయిరావమ్మా గౌరమ్మ