
సరస్వతిమాతా విగ్రహప్రతిష్ఠాపన
మోపాల్: మండలంలోని న్యాల్‌కల్ ప్రాథమిక పాఠశాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూల నక్ష త్రం సందర్భంగా సరస్వతీమాతా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఈవో గేమ్‌సింగ్ మా ట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు భక్తి భావన పెంపొందించుకోవాలని సూచించారు. ఎంపీవో కిరణ్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు కొట్టూరు దేవిదాస్, పంచాయతీ కార్యదర్శి మల్లేషం, విగ్రహ దాత గంగామణి దంపతులు, వీడీసీ చైర్మన్ కిరణ్ రావు, గ్రామస్తులు శ్రీధర్, ఏఏపీసీ చైర్మన్ సునీత, ఉపాధ్యాయులు పోసాని, శారదా, మాధవి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి: మండలంలోని ఘన్‌పూర్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ షాదుల్లా, రామకృష్ణ, న్యాసరాజేశ్వర్, డాక్టర్ లింబాద్రి, శక్కరికొండ సాగర్, దేవేందర్, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.