
కామన్ స్కూల్ విద్యా విధానం కావాలి
నిజామాబాద్ సిటీ: విద్యా వ్యవస్థలు అన్నీ ఒకే విధమైన విద్యావిధానం పాటించాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో పీఆర్‌టీయూ జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ముఖ్యఅతి థిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాల ల్లో అన్ని కులాలకు చెందిన పేద, నిరుపేద పిల్లలు చదువుతున్నారని, నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు. సీపీఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పుల్గం దామోదర్ రెడ్డి, భిక్షం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గుండు లక్ష్మణ్, వంగ మహేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కిషన్, పెంట జలంధర్, వెంకటేశ్వర గౌడ్, తుమ్మల లక్ష్మణ్, అంకం నరేశ్, గంట అశోక్, సరిత తదితరులు పాల్గొన్నారు.