
సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో విద్రోహ దినం
నిజామాబాద్ సిటీ/ డిచ్‌పల్లి: భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నెత్తుటేరులో ముంచిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చీకటి రోజని, తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. కోటగల్లి ఎన్‌ఆర్‌భవన్‌లో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్రోహ దినం సదస్సు నిర్వహించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులను అణచడానికి జవహాల్‌లాల్ నెహ్రూ కుట్రలు పన్నారని అన్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి పుట్ట వరదయ్య ఆధ్వర్యంలో నాగారంలో విద్రోహ దినోత్సవం నిర్వహించారు. నాందేవ్‌వాడలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షురాలు సుజాత అధ్యక్షతన తెలంగాణ సాయుధ రైతాంగ సభ నిర్వహించారు. కార్యదర్శివర్గ సభ్యురాలు నూర్జహాన్, నాయకులు పాల్గొన్నారు. డిచ్‌పల్లిలో సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా డిచ్‌పల్లి మండల కార్యదర్శి బోశెట్టి మురళి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ సభ నిర్వహించారు. మాస్‌లైన్ ప్రజాపంథా నాయకులు పాల్గొన్నారు.