
మహిళా సంఘాల్లో నగదు రహిత లావాదేవీలు
నందిపేట్ (ఆర్మూర్): మహి ళా సంఘాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందు కు జిల్లాలో పైలట్ మండలంగా నందిపేట్‌ను ఎంపిక చేశా రు. సోమవారం మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం ప్రతినిధులు, అసిస్టెంట్లకు ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెర్ప్ అధికారి వెంకట్ మాట్లాడుతూ.. వీవో అధ్యక్షులు, సిబ్బంది డిజిటల్ లా వాదేవీలపై చిన్న సంఘ సభ్యులందరికీ అవగాహన కల్పించాలన్నారు. గూగుల్ పే, ఫోన్ పే నుంచి రోజుకు రూ. లక్ష వరకు, చిన్న మొబైల్ నుంచి రోజుకు రూ. 5000 వరకు లావాదేవీలు చేసుకోవచ్చని వివరించారు. రేపటి నుంచి అన్ని గ్రామాలలో అన్ని సంఘాలకు సీసీలు, సీఆర్పీలు, వీవోఏలు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్డీవో మధుసూదన్, డీపీఎం సంధ్యారాణి, జిల్లా సమాఖ్య పాలకవర్గ సభ్యులు, ఏపీఎం ఖాందేశ్ గంగాధర్, బ్యాంకు అధికారులు, సీసీలు, సీఆర్పీలు, వీవోఏలు, వీవో ప్రతినిధులు పాల్గొన్నారు.