
దిశ సమావేశం 23కు వాయిదా
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ నెల 16న ఎంపీ ధర్మపురి అర్వింద్ అధ్యక్షతన జరగాల్సిన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం అనివార్య కారణాలతో 23వ తేదీకి వాయిదా పడినట్లు డీఆర్డీవో సాయాగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దిశ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
ఖలీల్‌వాడి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 23 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ ఆఫ్ పోలీ స్ సాయిచైతన్య ఫిర్యాదుదారుల సమస్యల ను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల ని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమే యం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవ లను వినియోగించుకోవాలని తెలిపారు.
వరల్డ్ బాక్సింగ్‌లో
పతకాల పంట
● జిల్లాకు చెందిన కోచ్
ఎత్తేసామొద్దీన్ నేతృత్వంలో..
నిజామాబాద్‌నాగారం: ప్రపచం బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన కోచ్ ఎత్తేసామొద్దీన్ నేతృత్వంలో మన దేశానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణిలు జాస్మిన్, మీనాక్షి ఉదాలు బంగారు పతకాలు సాధించారు. నుపుర్ షియోరాన్ (రజతం), పూజారాణి (కాంస్య) పతకాలు సాధించారు. ఇంగ్లాడ్‌లో ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మొత్తం నాలుగు పతకాలుసాధించా రు. భారత బాక్సింగ్ జట్టుకు కోచ్‌గా జిల్లా కు ఎత్తేసామొద్దీన్ వ్యవహరించడంతో జిల్లా కు చెందిన క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆనందనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకు చెందిన బాక్సింగ్ క్రీడాకారులు, జాతీయస్థాయి అథ్లెట్, గోల్డ్ మెడలిస్టు సయ్యద్ ఖైసర్ ఎత్తేసామొద్దీన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

దిశ సమావేశం 23కు వాయిదా