
బాధిత రైతులకు ఊరట
● పొలాల్లో ఇసుక మేటలు తొలగిస్తున్న ఉపాధి కూలీలు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఇటీవల కురిసిన భా రీ వర్షాల కారణంగా పంటపొలాల్లో వేసిన మట్టి, ఇసుక మేటల తొలగింపు సోమవారం నుంచి మొదలైంది. ఎస్టిమేషన్లు వేసిన అధికారులు ఉపాధి కూ లీల ద్వారా తొలగిస్తున్నారు. ఖర్చు లేకుండా ప్రభుత్వమే చర్యలు చేపట్టడంతో బాధిత రైతులకు కొంత ఊరట లభిస్తోంది.
జిల్లాలో మొత్తం 270 ఎకరా ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వర్ని, వేల్పూర్, ఇందల్వాయి, ధర్పల్లి, భీ మ్‌గల్, సిరికొండ మండలాలు కలిపి 389 మంది రైతులు బాధితులుగా ఉన్నారు. వరికి ఎక్కువగా నష్టం వాటిల్లగా, జరిగిన నష్టం నుంచి కోలుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పొలాల్లో వేసిన ఇసుక, మట్టిని ఉపాధి కూలీల సహాయంతో తొలగింపజేస్తోంది. ఇటు ఉపాధి కూ లీలకు కూడా పని లభిస్తోంది. వా రం, పది రోజుల్లోగా పొలాల్లోని ఇసుక, మట్టి మేటలను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు.