
లేబర్ రేట్లు పెంచాలని పనుల నిలిపివేత
సుభాష్‌నగర్: లేబర్ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అన్ని పనులను మంగళవారం నుంచి నిలిపేస్తున్నామని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రవీందర్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పవర్‌హౌస్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. 2021లో ఉన్న లేబర్ రేట్లకు, ప్రస్తుతమున్న రేట్లకు వ్యత్యాసం ఉందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఈవిషయాన్ని పలుమార్లు సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మంగళవారం నుంచి పనులు ఆపేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరిస్థితిని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమ్మెకు సహకరించి న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రవి యాదవ్, సంతోష్, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.