
చికిత్స పొందుతూ వివాహిత..
లింగంపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అయ్యపల్లితండాకు చెందిన దేవసోత్ సుజిత(20) అత్తింటివారి వేధింపులు భరించలేక ఆగస్టు 10 గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు..
ఖలీల్‌వాడి: నిజామాబా ద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియ ని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. నగరంలోని న్యాల్కల్ రోడ్‌లోగల కల్లు బట్టి సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి స్పృహ లేని స్థితిలో గుర్తించారు. వెంటనే సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యా హ్నం మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు లేత ఆరెంజ్ రంగు, కలర్ ఫుల్ షర్ట్, ముదురు నీలి రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 65 ఏళ్ల వరకు ఉంటాయని, న్యాల్కల్ రోడ్‌లో భిక్షాటన చేసేవాడని అన్నారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎవరికై నా సమాచారం తెలిస్తే ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.
నవీపేట: నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియ ని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. నవీపేట ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇ లా.. నవీపేట శివారులో ని అయ్యప్ప ఆలయ సమీపంలో ఈనెల 12న గుర్తుతెలియని ఓ వ్యక్తి అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 36ఏళ్లు ఉంటాయని ఎస్సై అన్నారు.

చికిత్స పొందుతూ వివాహిత..