
బకాయిల విడుదలకు ‘పోరుబాట’
ఇంజినీరింగ్ కళాశాలలకు 22 కోట్లు
బీఈడీ కళాశాలలకు 15.60 కోట్లు
నిజామాబాద్‌అర్బన్: స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు పోరుబాట పట్టా యి. నాలుగేళ్లుగా బకాయిలు విడుదల కాకపోవడంతో ఉన్నత కళాశాలలకు సోమవారం నుంచి బంద్ ప్రకటిస్తూ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్ అసోసియేషన్ నిర్ణయించింది. జిల్లాలో మొత్తం ఉన్నత విద్యా కళాశాలలు 109 ఉండగా, అందులో ప్రైవేటు కళాశాల లు 79 ఉన్నాయి. వీటితోపాటు మూడు ఇంజినీరింగ్ కళాశాలలు కొనసాగుతున్నాయి. సుమారు 50వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు.
గుదిబండగా బకాయిలు
జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇబ్బందికరంగా మారింది. గత నాలుగు సంవత్సరాలుగా బకాయిల చెల్లింపులలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు దశల వారీగా బకాయిలను విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన కళాశాలలకు సుమారు రూ.86 కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది.
విద్యార్థులపై
ప్రభావం..
ఉన్నత కళాశాలల బంద్‌తో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం డిగ్రీ కళాశాలల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగా, పీజీలో చేరేందుకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్‌మెంట్ మీద ఆధారపడిన విద్యార్థులు ఫీజు చెల్లించలేక ఉన్నత చదువులకు దూరమయ్యే అవకాశం ఉంది.
డిగ్రీ 50
పీజీ 11
బీఈడీ 13
బీపీఈఎడ్ 01
ఎంబీఏ 03
ఎంసీఏ 01
ఇంజినీరింగ్ 03
నిరవధికంగా కొనసాగుతుంది..
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం ఇదివరకు చా లా సార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా ఫలితం లేదు. అందుకే కళాశాలల బంద్ పాటిస్తున్నాం. నిధులు విడుదల చేసే వరకు కళాశాలల బంద్ నిరవధికంగా కొనసాగుతుంది. – సుధాకర్, ఉమ్మడి జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
వెంటనే విడుదల చేయాలి
పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. కళాశాలలకు బకాయిపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి. – రాజేశ్వర్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రైవేట్ ఉన్నత కళాశాలలు
జిల్లాలో బకాయిల వివరాలు
పెండింగ్‌లో నాలుగేళ్ల ఫీజు
రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్
జిల్లాలో సుమారు
రూ.86 కోట్ల బకాయిలు
నేటి నుంచి ఉన్నత విద్యా
కళాశాలలు బంద్

బకాయిల విడుదలకు ‘పోరుబాట’

బకాయిల విడుదలకు ‘పోరుబాట’