మోతాదుకు మించి యూరియా వాడొద్దు | - | Sakshi
Sakshi News home page

మోతాదుకు మించి యూరియా వాడొద్దు

Sep 15 2025 7:57 AM | Updated on Sep 15 2025 7:57 AM

మోతాద

మోతాదుకు మించి యూరియా వాడొద్దు

మోపాల్‌: వరికి యూరియాను మోతాదుకు మించి వాడొద్దని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవిందు రైతులకు సూచించారు. ఆదివారం మండలంలోని బోర్గాం(పి), మోపాల్‌ సొసైటీ గోదాములను పరిశీలించి యూరియా, ఇతర ఎరువుల నిల్వలు, రిజిస్టర్‌, స్టాక్‌బోర్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నానో యూరియాను వినియోగిస్తే మొక్కకు 90 శాతం వరకు చేరుతుందని తెలిపారు. తద్వారా మొక్క ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. జిల్లాలో యూరియా కొరత రాకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. యూరియా బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆయన వెంట సొసైటీ సిబ్బంది ఉన్నారు.

ఎత్తేసామొద్దీన్‌ నేతృత్వంలో బంగారు పతకం

నిజామాబాద్‌నాగారం: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సింగ్‌ క్రీడాకారిణి జాస్మిన్‌ బంగారు పతకం సాధించింది. శనివారం రాత్రి ఇంగ్లాండ్‌లో జరిగిన టోర్నీలో పోలాండ్‌ క్రీడాకారిణిని 4–1 తేడాతో ఓడించింది. కాగా, జాస్మిన్‌కు బాక్సింగ్‌ కోచ్‌గా జిల్లా చెందిన మహ్మద్‌ ఎత్తేసామొద్దీన్‌ వ్యవహరించారు. దీంతో బాక్సింగ్‌ క్రీడాకారుడు, జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ గోల్డ్‌మెడలిస్టు సయ్యద్‌ ఖైసర్‌ కోచ్‌ ఎత్తేసామొద్దీన్‌ను అభినందించారు.

కేసుల పరిష్కారంలో జిల్లాకు 4వ స్థానం

లోక్‌ అదాలత్‌లో

7,444 కేసులు రాజీ

సీపీ సాయిచైతన్య

ఖలీల్‌వాడి: జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన, రాజీపడటానికి అవకాశం ఉన్న 7,444 కేసులను జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో రాజీ కుదుర్చినట్లు సీపీ సాయిచైతన్య ఆదివారం తెలిపారు. బీఎన్‌ఎస్‌(ఐపీసీ) కేసులు 501, ఈ–పెట్టీ కేసులు 1958, డీడీ, ఎంవీఐ యాక్ట్‌లో 4,985 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. 138 సైబర్‌ క్రైమ్‌ కేసులలో రూ.42,45,273 తిరిగి సైబర్‌ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్‌ కాపీలను సంబంధిత బ్యాంక్‌ నోడల్‌ అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబర్‌ క్రైమ్‌, వివిధ కేసులలో రాజీమార్గం చేసినందుకు జిల్లాకు 4వ స్థానం లభించిందన్నారు. ప్రజలు సైబర్‌ మోసాలకు గురైతే ట్రోల్‌ఫ్రీ నెంబర్‌ 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేసినసైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ వై వెంకటేశ్వర్‌ రావు, సీఐ ముఖీద్‌ పాషా, రిజర్వ్‌ సీఐ సతీశ్‌, కోర్ట్‌ డ్యూటీ, సైబర్‌ సెల్‌ సిబ్బందిని అభినందించారు.

మోతాదుకు మించి యూరియా వాడొద్దు 1
1/2

మోతాదుకు మించి యూరియా వాడొద్దు

మోతాదుకు మించి యూరియా వాడొద్దు 2
2/2

మోతాదుకు మించి యూరియా వాడొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement