
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
వేల్పూర్: ఎంపీ అర్వింద్ తప్పుడు ఆరోపణలు చే స్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మానుకోవాలని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మా నాల మోహన్‌రెడ్డి హితవు పలికారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద డీసీసీ బీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. పోలీసులు ఒక వ ర్గానికే మద్దతుగా ఉంటున్నారని, దానికి కాంగ్రె స్ నాయకులు వత్తాసు పలుకుతున్నారని ఎంపీ అ ర్వింద్ చేసిన ఆరోపణలు కేవలం ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని చేసినవేనని మండిపడ్డారు. యూరి యా సరఫరా వైఫల్యానికి కారణంగా కాంగ్రెస్ అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కేంద్రం పంపిన యూరియా ను కాంగ్రెస్ ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా ను కేంద్రం సక్రమంగా ఇవ్వకపోవడం వల్లనే కొర త ఏర్పడుతోందన్న విషయం రైతులు గుర్తించాలని కోరారు. యూరియ కోసం సీఎం, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి యూరియా కొరతపై కేంద్రానికి విన్నవిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం కావాలనే మన రాష్ట్రానికి కోత విధించిందన్నారు. వేల్పూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి పాల్గొన్నారు.
అర్వింద్ రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలి
యూరియా కొరత పాపం బీజేపీదే
రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి