
మంజీరపై రాతి వంతెన
బోధన్: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో సాలూ ర శివారులో మంజీర నదిపై 90 ఏళ్ల క్రితం నిజాం పాలనలో నిర్మించిన లో లెవల్ రాతి వంతెన చెక్కు చెదరలేదు. నిజాంపాలనలో (1935–36) నిర్మించి న ఈ వంతెన నాటి ఇంజినీర్ల నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. వంతెనను పూర్తిగా రాయి, సున్నం డంగుతో పటిష్టంగా నిర్మించారు. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం కోసం నిర్మించిన వంతెన మంజీరాకు భారీ వరదలు వచ్చినా తట్టుకుని నిలబడింది. 1985–86లో రాతి వంతెనకు దిగువన మ హారాష్ట్ర–ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మించిన హైలెవల్ వంతెన ఐదేళ్ల క్రితం పూర్తిగా దెబ్బతిన్నది. కానీ రాతి లోలెవల్ వంతెన ఇప్పటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు సాక్షిగా నిలుస్తోంది.
● రాష్ట్ర సరిహద్దులో నిర్మాణం
● నాటి ఇంజినీర్ల నైపుణ్యానికి
సజీవ సాక్ష్యం