
అనాథలైన సోదరులను ఆదుకోరూ!
మాక్లూర్: తండ్రి గల్ఫ్ దేశానికి వెళ్లి గల్లంతుకాగా, ఆ బాధతో తల్లి మంచంపట్టి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో వారి ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలారు. పట్టించుకునేవారు లేక సోదరు లు విలపిస్తుండగా, ఉదార స్వభావులు వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మండలంలోని మాదాపూర్‌కు చెందిన పర్సో ల్లా రాజు బతుకుదెరువు నిమిత్తం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి అక్కడ గల్లంతయ్యాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. ఆ బాధతో భార్య సత్తె మ్మ మచ్చం పట్టి అనారోగ్యంతో వారం రోజుల క్రి తం మృతి చెందింది. దీంతో వారి కుమారులు ఎవ రు లేని అనాథలుగా మి గిలారు. అంతేకాకుండా మృతి చెందిన తల్లికి అంత్యక్రియలు ఎలా చేయా లో తెలియక బిక్కుబిక్కుమంటూ విలపిస్తూ ఉంటే గ్రామస్తులు స్పందించి విరాళాలు సేకరించి అంత్యక్రియలు పూర్తి చే శారు. తల్లి మృతితో ఒంటరైన పిల్లలకు చిన్న ఇ ల్లు తప్పా వారి వద్ద ఏమి లేవు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన రోహిత్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా, తమ్ముడు దీక్షిత్ 6వ తరగతి చదువుతున్నాడు. దీంతో వీరి దీనస్థితిని చూసి చలించి, ఇప్పటికే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి రూ.10,000, ఆస్కార్ యూత్ సభ్యులు రూ.12000 నగదు, నిత్యవసర సరుకులను అందించారు. మరికొందరు ఉదార స్వభావులు ముందుకు వచ్చి అనాథలైన వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తండ్రి దుబాయ్‌లో గల్లంతు
ఆ బాధతో అనారోగ్యానికి గురై
ఇటీవల మృతిచెందిన తల్లి
పట్టించుకునేవారు లేక
విలపిస్తున్న అన్నదమ్ముళ్లు
ఉదార స్వభావులు ఆదుకోవాలని గ్రామస్తుల వినతి