
సామాజిక సేవలు అభినందనీయం
నిజామాబాద్ రూరల్: సమాజంలో విద్య, వైద్య రంగాలకు జోస్ ఆలుక్కాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నా రు. నగరంలోని జోస్ ఆ లుక్కాస్ జువెలరీ షో రూంలో శనివారం మూ డవ వార్షికోత్సవం ఘ నంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలోని ఆస్పత్రులు, బడులకు అవసరమైన సామగ్రిని జోస్ ఆలుక్కాస్ సంస్థ అందజేస్తుండటంపై అభినందించారు. ప్రస్తుతం నాలు గు ప్రభుత్వ పాఠశాలకు సుమారు రూ.6.96 లక్షల విలువగల కంప్యూటర్‌లు, డిజిటల్ టీవీ, తాగునీటి శుద్ధియంత్రం వాటికి నిధులు అందజేశారన్నారు. మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 13 నుంచి 19 వరకు ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలకు ఎంపీ చేతుల మీదుగా సీఎస్‌ఆర్ ఫండ్ చెక్కులను అందజేశారు. బ్రాంచ్ మేనేజర్ ధనుష్, అసిస్టెంట్ మేనేజర్ సజయ్, అకౌంట్స్ మేనేజర్ జితిన్, పీఆర్‌వో పిప్పెర నరేందర్, తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.