
నాయబ్ తహసీల్దార్లకు పదోన్నతి
నిజామాబాద్‌అర్బన్: పలువురు నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర రెవెన్యూ శాఖ శుక్రవారం జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న నేనావత్ రాక, నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లుగా పదోన్నతి పొంది జిల్లాకు రానున్నారు. కాగా ఇదే జిల్లాలో పనిచేస్తున్న నరేష్ నాయబ్ తహసీల్దార్ నుంచి తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. వీరికి త్వరలోనే మండలాలు కేటాయించనున్నారు.
ఖలీల్‌వాడి: పోలీసుల ఆత్మస్థైర్యంను దెబ్బతీయవద్దని, పోలీసులకు అందరు సమానులేనని నిజామాబాద్ పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ష కీల్ పాషా అన్నారు. జిల్లాకేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులపై బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. ఆర్మూర్‌లోని యాసీన్ హోటల్ నిబంధనలకు విరుద్ధంగా రాత్రివే ళ కొనసాగడంతో కేసులు నమోదు చేశామన్నారు. పోలీసుల పేర్లు పింక్‌బుక్‌లో రాస్తామని సదరు నా యకుడు చెప్పడం సరైనది కాదన్నారు. పోలీసులు నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తారని, ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించరని తెలిపారు. మరోసారి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సంఘం ప్రతినిధులు చందూలాల్, సాయిలు, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వివాహితతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి మూడేళ్ల జైలు
నిజామాబాద్ లీగల్: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి నిజామాబాద్ నాల్గవ అడిషనల్ మహిళ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10వేల జరిమానా విధించింది. వివరాలు ఇలా.. రెంజల్ మండల కేంద్రానికి చెందిన గైని కిరణ్ 2023 ఏప్రిల్ 14న తన పక్కింట్లో నివసించే వివాహిత ఒంటరిగా ఉండగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో భర్త అక్కడికి చేరుకుని కిరణ్‌ను పట్టుకునేందుక ప్రయత్నించగా, ఫరారయ్యాడు. దీనిపై దత్తు తన భార్యతో కలిసి రెంజల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని జిల్లా కోర్టులో హాజరుపర్చారు. జడ్జి సాక్ష్యాలను విచారించిన అనంతరం నిందితుడు గైని కిరణ్‌కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. అలాగే జిల్లా న్యాయసేవ సంస్థ బాధితురాలికి రూ.50వేల పరిహారం చెల్లించాలని జడ్జి తన తీర్పులో సూచించారు.