యూరియా గోదాముల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

యూరియా గోదాముల తనిఖీ

Sep 13 2025 2:36 AM | Updated on Sep 13 2025 2:36 AM

యూరియా  గోదాముల తనిఖీ

యూరియా గోదాముల తనిఖీ

మాక్లూర్‌: మండల కేంద్రంలోని పీఏసీఎస్‌, గ్రోమోర్‌ గోదాములను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ శుక్రవారం ఆకస్మికంగా త నిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొందరు రైతులు లేటుగా నాట్లు వేశారని అలాంటి వారికి సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. రై తులు కూడా అవసరం మేరకే యూరియా చల్లుకోవాలని సూచించారు. వరి పొట్ట దశ లో అధిక యూరియా వాడటంతో చీడపీడ లు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. సొసైటీ, గ్రోమోర్‌ గోదాంలలో యూరియా నిల్వలు ఉండటంపై డీఏవో సంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారిణి పద్మ ఉన్నారు.

అర్బన్‌పార్క్‌ను

సందర్శించిన డీఎఫ్‌వో

మాక్లూర్‌: మండలంలోని చిన్నాపూర్‌ శివారులో ఉన్న అర్బన్‌ పార్క్‌ను శుక్రవారం డివిజనల్‌ ఫారెస్టు అధికారి భవానీశంకర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పార్కుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, రోజువారీగా పార్కుకు వస్తున్న సందర్శకుల సంఖ్య వివరాలు తెలుసుకున్నారు. పార్కులో ఎంతమంది డ్యూటీలు చేస్తున్నారని అడిగా రు. ఆయన వెంట ఎఫ్‌ఆర్వో అశోక్‌, బీట్‌ అధికారి సుశీల్‌ ఉన్నారు.

నిజాంసాగర్‌ 4 గేట్ల ఎత్తివేత

నిజాంసాగర్‌: సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో శుక్రవారం నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 15,296 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజె క్టు నాలుగు వరద గేట్లను ఎత్తి 21,988 క్యూ సెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1,404.82 అడుగుల(17.542 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

ఏడు మండలాల్లో

అధిక వర్షం

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షం కురుస్తోంది. ఏడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. శుక్రవారం 44.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా మోస్రాలో 74.6, చందూరు 71.3, మోర్తాడ్‌ 65.1, నవీపేట 60.4, ఎడపల్లి 58.5, మోపాల్‌ 57.7, వర్ని 56.5, నిజామాబాద్‌ సౌత్‌ 53.8, ఆలూర్‌ 52.4. రెంజల్‌ 51.8, కమ్మర్‌పల్లి 51.4, మాక్లూర్‌ 51.2, జక్రాన్‌పల్లి 50.9, భీమ్‌గల్‌ 48.0, ఏర్గట్ల 46.0, సిరికొండ 45.1, రుద్రూర్‌ 41.2, నిజామాబాద్‌ నార్త్‌లో 40.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 24 మండలాల్లో సాధారణ, రెండు మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో శనివారం భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దేవీరోడ్‌లో వన్‌ వే

ఖలీల్‌వాడి: నగరంలోని దేవీరోడ్‌లో వన్‌ వే ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ తెలి పారు. వ్యాపార సముదాయాలు, బ్యాంకు లు, ఆలయాలు ఉండే ఈ ప్రాంతంలో వా హనాలు రోడ్డుపై పార్కింగ్‌ చేయడంతో ట్రా ఫిక్‌ జామ్‌ అవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ ఆధ్వర్యంలో బారికేడ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వన్‌ వే ప్రారంభించామన్నారు. వాహనదారులు రైల్వే ఫ్లైఓవర్‌ వైపు నుంచి గంజ్‌ గేట్‌–1 మీదుగా, ద్విచక్ర వాహనదారులు దేవిరోడ్‌ నుంచి సాయిరెడ్డి పెట్రోల్‌ బంక్‌ వ ద్ద బయటకు వెళ్లాలని తెలిపారు. హెవీ వెహికల్స్‌, ఆటోలు, ఫోర్‌ వీలర్స్‌కి ప్రవేశం లేదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement