
డీఫాల్ట్ మిల్లర్లపై ఆర్‌ఆర్ యాక్ట్
● ఆస్తులు వేలం వేసి సీఎంఆర్ నిధులు రికవరీ చేయండి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డీఫాల్ట్ రైస్‌మిల్లర్ల పై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటి వర కు చేపట్టిన చర్యలు, వారి నుంచి రావాల్సిన మొ త్తం, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారనే వివరాల ను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. డీఫాల్ట్ రైస్ మిల్లులతోపాటు మిల్లర్లకు చెందిన ఆస్తులను బ్లాక్ చేయించాలని, అవసరమైతే ఆస్తులను వేలం వేసి సీఎంఆర్ నిధులను రాబట్టే దిశగా చర్యలు తీ సుకోవాలని స్పష్టం చేశారు. సీఎంఆర్ నిధులు పూ ర్తిస్థాయిలో రికవరీ కావాల్సిందేనని, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. సీఎంఆర్ రికవరీపై ప్రతి వారం సమీక్ష జరుపుతానని, ఎప్పటికప్పుడు ప్రగతి కనిపించాలని అన్నారు.
‘భూభారతి’ దరఖాస్తులు పరిష్కరించాలి
భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్‌వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.