
అక్రమ కేసులు.. అప్రజాస్వామికం
● నిజాలు నిర్భయంగా రాయడం తప్పా?
● ‘సాక్షి’ ఎడిటర్, పాత్రికేయులపై కేసులు ఎత్తివేయాలి
● ఏపీ ప్రభుత్వ కుట్రలపై మేధావుల
మండిపాటు
నిజామాబాద్‌అర్బన్: ‘ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం జర్నలిజం. ప్రజల సంక్షేమం కోసం పాత్రికేయులు పాటుపడతారు. అలాంటి వారిపై ప్రభుత్వాలు అక్రమ కేసులు బనాయించడం స్వేచ్ఛను హరించడమే’ అవుతుందని మేధావులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తమకు అనుకూలంగా ఉండాలని జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.