
ఆర్టికల్ 19(1)(ఏ)ను అతిక్రమించడమే..
ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కేసులు పెట్టడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తన భావాల్ని వెల్లడించే హ క్కు ఉంటుంది. వాటిని ప్రచురించే హక్కు మీడియాకు ఉంటుంది. భావ ప్రకటనను పా ర్లమెంటరీ భాషలో వెల్లడించాలి. ప్రభుత్వ పనుల్లో లో టుపాట్లను పత్రికలు ఎత్తిచూపుతాయి. అంతమాత్రాన వారిపై చర్యలకు పూనుకోవడం ఆర్టికల్ 19(1)(ఏ)ను అతిక్రమించడమే అవుతోంది.
– ఆల్గోట్ రవీందర్, సీనియర్ అడ్వొకేట్,
పౌరహక్కుల నాయకుడు