
గ్రామ పాలనాధికారులకు పోస్టింగ్‌లు
నిజామాబాద్‌అర్బన్: గ్రామ పాలనాధికారులు(జీపీవో)గా నియమితులైన వారికి సోమ వారం పోస్టింగ్‌లు ఇచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వా రా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ జీపీవోలకు పోస్టింగ్‌లను ఖరారు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అదనపు కలెక్టర్లు అంకిత్, కిర ణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఇతర అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు.