
హుండీ ఆదాయం లెక్కింపు
నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు నోట్ల ద్వారా రూ.5,79,130, నాణెములు రూ. 93,081, మొత్తం రూ. 6,72,211 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ పరిశీలకురాలు కమల వెల్లడించారు. ఆరు గ్రాముల మిశ్రమ బంగారం, 305 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.వేణు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్, ధర్మకర్తలు పోలకొండ నర్సింగ్ రావు, సిరిపురం కిరణ్ కుమార్, పవర్ విజయ, కొర్వ రాజ్‌కుమార్, అర్చకులు నాగరాజాచార్యులు, జూనియర్ అసిస్టెంట్లు ప్రశాంత్ కుమార్, ఆంజనేయులు, రఘునాథ్, సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొన్నారు.