
జాతీయ లోక్‌అదాలత్‌ను ఉపయోగించుకోవాలి
ఖలీల్‌వాడి: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ సాయి చైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నచిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలకు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ పాల్గొని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చని తెలిపారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. బీఈడీ 2, 4వ సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 27 మంది విద్యార్థులకు 18 మంది హాజరుకాగా, 9 మంది గైర్హాజరయ్యారు. ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షల్లో మొత్తం 31 మందికి గానూ 30 మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు తెలిపారు. వర్సిటీ కళాశాలలో సోమవారం జరిగిన ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 39 మంది విద్యార్థులకు 34 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.