
ఐలమ్మ స్ఫూర్తి అందరికీ ఆదర్శం
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఐలమ్మ వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వినాయక్‌నగర్‌లోని ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మరోసారి ఇంటర్
అడ్మిషన్ లాగిన్
● మార్పులకు రెండ్రోజులు అవకాశం
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఇతర అన్ని సాంఘిక సంక్షేమ గు రుకుల కళాశాలలో ఇంటర్ అడ్మిషన్ల లాగిన్ ఓపె న్ చేస్తున్నట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఈ నెల 11, 12 తేదీలలో అడ్మిషన్ లాగిన్ మార్పులు, ఇతర పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు కళాశాలలో నామినల్ రోల్ కరెక్షన్ కోసం ప్రతి విద్యార్థికి రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఎలాంటి రుసుము ఉండదని తెలిపారు. మరోసారి అడ్మిషన్ లాగిన్ ఉండదని, ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు.