
జలసిరులు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలు భూగర్భ జలాల పెరుగుదలకు ఎంతో దోహదప డ్డాయి. లోటు పరిస్థితి నుంచి మేలైన స్థాయికి తీ సుకొచ్చాయి. జూలై వరకు 11.76 మీటర్ల లో తులో ఉన్న జలాలు ఆగస్టు ముగిసే నాటికి సరా సరి 8.48 మీటర్లకు వచ్చాయి. అంటే ఒక్క నెలలోనే ఏకంగా 3 మీటర్ల వరకు పెరిగాయి. ఇది గ తేడాది ఆగస్టు (8.66 మీటర్లు)తో పోలిస్తే మెరుగైన పరిస్థితి. వర్షాకాలంలో ఇప్పటి వరకు 78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, ఇందులో సగం మేర ఆగస్టులోనే వర్షం కురిసింది. వరదలు పోటెత్తి భూగర్భంలో ఊట భా రీగా చేరింది. మే నెల నుంచి ఆగస్టు నాటికి వచ్చే సరికి మొత్తంగా 4 మీటర్లు పెరిగాయి. వచ్చే ఏడాది వరకు బోరుబావులు, సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారి శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు.
53 ఫిజోమీటర్లలో పుష్కలంగా జలం...
ఆగస్టు మాసానికి సంబంధించిన భూగర్భ జలాల లెక్కలను ఇటీవల గ్రౌండ్‌వాటర్ డిపార్ట్‌మెంట్ తీసింది. జిల్లా వ్యాప్తంగా 82 ఫిజోమీటర్ల ద్వారా నీటి లెక్కలను సేకరించింది. ఇందులో 53 ఫిజోమీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. 25 ఫిజోమీటర్లలో 10–20 మీటర్ల లోపు, నాలుగు ఫిజో మీటర్లలో 20 మీటర్ల లోతులో జలాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 65–85 శాతం వరకు భూగర్భ జలాలు పుష్కలంగా విస్తరించి ఉన్నాయి. ఇది వరకు కురిసిన వర్షాలతోపాటు మున్ముందు కూడా పడే అవకాశం ఉండడంతో మరికొంత మేర భూరగ్భ జలాలు పెరిగే అవకాశం ఉంది.
నెలల వారీగా భూగర్భ జలాలు (మీటర్లలో)
భూగర్భ జలాలు ౖపైపెకి..
జిల్లాలో సరాసరి నీటిమట్టం
8.48 మీటర్లు
భారీ వర్షాలతో తీరిన నీటి లోటు