
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ
మోపాల్(నిజామాబాద్‌రూరల్): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో పీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పార్టీ పరిశీలకులు బాడ్సి శేఖర్‌గౌడ్ సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో పార్టీ పరిస్థితి, జిల్లా, మండల కమిటీల ఎన్నిక, తదితర అంశాలను మీనాక్షి నటరాజన్‌కు వివరించారు. కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించే బహిరంగసభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలను తరలించాలని, సభ విజయవంతం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించినట్లు శేఖర్ గౌడ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం బాధ్యతలు అప్పగిస్తే పని చేయాలన్నారని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ, ఆఫీస్ బేరర్ల సమావేశానికి శేఖర్‌గౌడ్ హాజరయ్యారు.