
బీసీ రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నాం
● ఈనెల 15న కామారెడ్డిలో జరిగే
బహిరంగసభను విజయవంతం చేయాలి
● డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌కు కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకా రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మానాల మాట్లాడుతూ.. జనాభా ప్రకారం రిజ ర్వేషన్లు అమలు చేయాలన్న ఏఐసీసీ అగ్రనేత రా హుల్‌గాంధీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలుచేస్తున్నామన్నారు. బీసీ రి జర్వేషన్లపై అసెంబ్లీలో జరిగిన చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్ధతు పలికితే, బీజేపీ ఎంపీలు మాత్రం రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని, ద్వంద్వ నీతిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. యూరియా కొ రతకు కేంద్రప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. యూ రియా కొరత జిల్లాలో పెద్దగా లేదన్నారు. బీసీల రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తీసివేయాలని బీజే పీ ఎంపీలు వితండవాదం చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీ సీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 15న కామారెడ్డిలో ముఖ్యమంత్రి హాజరయ్యే బీసీ గర్జనను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఓబీసీ అధ్యక్షుడు రాజనరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడు కెతావత్ యాదగిరి, సీనియర్ నాయకులు మహ్మద్ ఖుద్దూ స్, ప్రమోద్ కుమార్, వేణురాజ్, బోదిరే స్వామి, కేశ మహేష్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, ఈసా, అబ్దుల్ ఎ జాజ్, సుభాష్ జాదవ్, సంగెం సాయిలున్నారు.