
విద్యారంగంలో తెయూ గణనీయమైన ప్రగతి
● వీసీ యాదగిరిరావు
● ఘనంగా వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం
తెయూ(డిచ్‌పల్లి):విద్యారంగంలో తెలంగాణ యూ నివర్సిటీ గణనీయమైన ప్రగతి సాధించిందని తె యూ వీసీ యాదగిరిరావు అన్నారు. క్యాంపస్ ఆవరణలో గురువారం తెలంగాణ యూనివర్సిటీ ఆవి ర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ 11 సెప్టెంబర్ 2006న 6 కోర్సులు, 12 మంది రెగ్యులర్ అధ్యాపకులతో ప్రారంభం కా గా, గడిచిన 19 ఏళ్లలో రాష్ట్రంలో మూడో అతిపెద్ద యూనివర్సిటీగా పరిణామం చెందడం గర్వకారణంగా ఉందన్నారు.ప్రస్తుతం 60 మందికి పైగా రెగ్యులర్ అధ్యాపకులు, 50 మందికి పైగా కాంట్రా క్టు అధ్యాపకులు, 13 మంది నాన్ టీచింగ్ సిబ్బంది, 275 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది, మూడు క్యాంపస్‌లలో 31 కోర్సులకు విస్తరించిందన్నారు. అందరి సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని కోర్సులను తెలంగాణ యూనివర్సిటీలో ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. కంట్రోలర్ సంపత్ కుమార్, యూజీసీ కోఆర్డినేటర్ ఆంజనేయు లు,ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి, అధ్యాపకులు అపర్ణ,రవీందర్‌రెడ్డి,ఎల్లోసా,అతీక్ సుల్తాన్ ఘోరి,సత్యనారాయణరెడ్డి,వాణి,భ్రమరాంబిక,స్రవంతి,నీలిమ,అసిస్టెంట్ రిజిస్ట్రార్ సా యాగౌడ్, ఏఈ వినోద్, తదితరులు పాల్గొన్నారు.