
గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఇంటర్వ్యూలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మ్యాథమెటిక్స్, ఫిజి క్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈసీఈ, ఈఈఈ, మెకా నికల్, సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు బోధించటానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం గురువారం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు వందమంది అభ్యర్థులు రాగా, వర్సిటీ పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం నుంచి ఇంటర్వ్యూలు చేశారు. తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆరతి విషయనిపుణులను సమన్వయం చేశారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్స్ నందిని, అతిక్ సుల్తాన్ ఘోరి, భ్రమరాంభిక, నీలిమ సాంకేతిక సహాయం అందించారు.
ప్రశాంతంగా ఎంఈడీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షల్లో ఒక విద్యార్థికి గానూ ఒకరు హాజరైనట్లు ఆయన తెలిపారు.
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ ఎంపికలకు జిల్లా జట్టు ఖరారు
నిజామాబాద్‌నాగారం: నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో గురువారం జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల జాతీయస్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశారు. బాలుర విభాగంలో 13 మంది, బాలిక విభాగంలో ఏడుగురు ఎంపికయ్యారు. వీరిని ఈనెల 12న హైదరాబాద్‌లో నిర్వహించే జాతీయ స్థాయి ఎంపిక పోటీలకు పంపనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీరెల్లి విజయ్ రావు, బొబ్బిలి నరేష్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి నిఖిల్ తెలిపారు. సంఘ సభ్యులు శ్రీనివాస్, బెనర్జీ , విశాల్, ప్రణీత్, అరుణ్, నవీన్ పాల్గొన్నారు.

గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఇంటర్వ్యూలు