
చిత్రం.. సందేశాత్మకం
ఆర్మూర్‌లోని రోడ్డు పక్కన గోడలపై వేసిన చిత్రాలు
ఆర్మూర్‌టౌన్ : మొన్నటి వరకు కళావిహీనంగా కనిపించిన గోడలు.. ప్రస్తుతం సందేశాత్మక చిత్రా లతో ఆకట్టుకుంటున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు వివిధ కార్యాలయాలు, కూరగాయల మార్కెట్ ప్రహరీలు కొత్తందాలను సంతరించుకుంటున్నాయి. సర్కారీ గోడలపై అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తూ పట్టణ పురపాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. రూ. 4 లక్షలతో శుభ్రత, పారిశుద్ధ్యం, ప ర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాలను మాన్పించడం, తెలంగాణ సంస్కృతి, రైతుల గౌరవం వంటి అంశాలు ప్రతిబింబించేలా చిత్రాలను గీయిస్తున్నారు. ఇలాంటి చిత్రాలతో గోడ సమీపంలో చెత్త వేయాలనే ఆలోచన రాదని, అవగాహన సైతం పెరుగుతుందని పుర ప్రజలు చెబుతున్నారు.
ఆర్మూర్ పట్టణాన్ని అందంగా మార్చడమే లక్ష్యం. ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు చిత్రాలు వేస్తున్నాం. దీంతో పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. చెత్త వేయాలన్న ఆలోచన రాదు.
– రాజు, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్

చిత్రం.. సందేశాత్మకం

చిత్రం.. సందేశాత్మకం

చిత్రం.. సందేశాత్మకం

చిత్రం.. సందేశాత్మకం