
నాణ్యమైన పోస్టల్ సేవలు అందిస్తాం
నిజామాబాద్ లీగల్: పోస్టల్ డిపార్ట్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేశామని, దీనిద్వారా నాణ్యమైన సేవలను అందిస్తామని పోస్టల్ ఎస్‌ఎస్పీవో ఎస్ జనార్ధన్‌రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా పోస్టాఫీస్‌లో మంగళవారం ఆయన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన సాఫ్ట్‌వేర్‌పై సిబ్బందికి గత నెల 15 రోజులుగా శిక్షణ ఇచ్చామని, నూతన సాఫ్ట్‌వేర్, శిక్షణ కార్యక్రమాలనతో తమ సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందని అన్నారు. ఏఎస్‌పీ సురేఖ, ఐపీపీజీ శ్రావణ్, అసిస్టెంట్ పోస్టుమాస్టర్ అజయ్ కుమార్, పోస్టుమాస్టర్ రాజేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.