
ఆర్టీసీకి మహాలక్ష్మి
రీజియన్‌లో రోజుకు 1.80 లక్షల మందికిపైగా మహిళల ప్రయాణం
ఖలీల్‌వాడి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి లక్ష్మి కళ తీసుకొచ్చింది. మహి ళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతుండగా.. అదే రీతిలో సంస్థకు ఆదాయం సమ కూరుతోంది! 200 కోట్ల జీరో టికెట్లు జారీ అయిన సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బుధవారం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల్లో సంబురాలు నిర్వహించింది. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితోపాటు అదనపు కలెక్టర్లు సంబురాల్లో పాల్గొన్నారు.
ఎదురు చూపులు లేవు.. టార్గెట్ గండం లేదు
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు గతంలో ప్రయాణికుల కోసం వేచి చూడాల్సి వచ్చేది. బస్సుల్లో సీట్లు భర్తీకాకపోవడంతో ప్రతినెల ఆర్టీసీకి నష్టం వచ్చేది. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్, కండక్టర్‌కు రూట్‌లో కలెక్షన్ టార్గెట్ విధించేవారు. ‘మహాలక్ష్మి’ పథకం పుణ్యమాని ఇప్పుడు సంస్థకు ఆదాయం సమకూరుతుండడంతోపాటు డ్రైవర్లు, కండక్టర్లకు కలెక్షన్ టార్గెట్ గండం తప్పింది. ఆర్టీసీ బస్సుల్లో కెపాసిటీ కన్నా ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ లాభాల్లోకి చేరింది.
ఉమ్మడి జిల్లా రీయింబర్స్‌మెంట్
మహాలక్ష్మి పథకం 2023 డిసెంబర్ 9వ తేదీన ప్రారంభం కాగా, ఇప్పటి వరకు రీజియన్ పరిధిలో 5.84 కోట్ల మంది మహిళలు (జీరో టికెట్లు) బస్సు ల్లో ప్రయాణించారు. దీని ద్వారా సంస్థకు రూ.239.17 కోట్ల ఆదాయం సమకూరింది. ఉమ్మ డి జిల్లాలోని ఆరు డిపోల నుంచి 581 బస్సులు వివిధ రూట్‌లలో తిరుగుతాయి. మొత్తం 3లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా అందులో 1.80లక్షల మంది వరకు మహిళలు ఉంటున్నారు. రోజుకు సుమారు రూ.1.50కోట్ల ఆదా యం సమకూరుతోంది.
టిక్కెట్ ప్రయాణికుల కోసం డీలక్స్, ఏసీ..
మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వారి రద్దీ పెరగడంతో చార్జీలు చెల్లించి బస్సుల్లో వెళ్లే వారి కోసం ఆయా రూట్‌లలో సంస్థ డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. బస్సుల్లో టిక్కెట్ చెల్లించే వారికి సౌకర్యంగా ఉంటుంది. దీంతోపాటు హైదరాబాద్, బెంగళూర్ తదితర ప్రాంతాలకు ఏసీ బస్సులను అందుబాటులో ఉంచారు.
వీటిలో ప్రయాణించే మహిళలను లక్కీడిప్ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తున్నారు. టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో వరంగల్, సిద్దిపేట్, కా మారెడ్డి తదితర ప్రాంతాలకు ప్రయాణించే మహి ళా ప్రయాణికుల సంఖ్య సైతం పెరిగింది.
మహిళల అభ్యున్నతికి కృషి
ఆర్మూర్ ఆర్టీసీ సంబురాల్లో కలెక్టర్
టి వినయ్‌కృష్ణారెడ్డి
ఆర్మూర్ : మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో బుధవారం నిర్వహించిన సంబురాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు మహిళా ప్రయాణికులతోపాటు సంస్థ సిబ్బందిని సన్మానించారు. అలాగే ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఒక్క నిజామాబాద్ రీజియన్ పరిధిలోనే కొత్తగా 141 బస్సులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్‌ఎం జ్యోత్స్న, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, డిపో మేనేజర్ రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, ప్రయాణికులు పాల్గొన్నారు.
రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయం
సమకూరిన ఆదాయం
రూ.239.17 కోట్లు
ఉమ్మడి జిల్లాలో ఆరు డిపోలు..
581 బస్సులు
ఘనంగా ఆర్టీసీ సంబురాలు
డబ్బులు మిగులుతున్నాయి
ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో నెలకు సుమారు రూ.2వేల వరకు ఆదా అవుతున్నాయి. ఆ డ బ్బులను ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నాను. ప్రయివేట్ రంగంలో జీతాలు తక్కువగా ఉంటాయి. బస్సు చార్జీలు తప్పడంతో కొంత వరకు కలిసి వస్తోంది. – ప్రజ్ఞాశర్మ, ప్రయివేట్ ఉద్యోగిని,
మాధవనగర్, నిజామాబాద్
ప్రయాణ ఖర్చులు లేవు
ఆర్టీసీ బస్సుల్లో ఉ చితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ప్రయాణ ఖర్చులు మిగులుతున్నాయి. ప్రైవేట్ వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. ఇప్పుడు చాలా బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. – సరళ, ప్రయివేట్ ఉద్యోగి,
జాన్కంపేట్, ఎడపల్లి
అందుబాటులో బస్సులు
రీజియన్ పరిధిలో మహాలక్ష్మి పథకం అమలు కోసం అవసరమైన బస్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా టిక్కెట్ తీసుకుని ప్రయాణించే వారి కోసం డీలక్స్, ఏసీ బస్సులను అందుబాటులో ఉంచాం. ప్రయాణికు ల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడుపుతున్నాం. ఇప్ప టి వరకు ఉమ్మడి జిల్లాకు 141 బస్సులు వచ్చాయి. దసరా వరకు అదనంగా మరో 31 కొత్త బస్సులు వస్తాయి. మహిళలు ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవాలి.
– జ్యోత్స్న, ఆర్‌ఎం, నిజామాబాద్

ఆర్టీసీకి మహాలక్ష్మి

ఆర్టీసీకి మహాలక్ష్మి

ఆర్టీసీకి మహాలక్ష్మి

ఆర్టీసీకి మహాలక్ష్మి

ఆర్టీసీకి మహాలక్ష్మి