రేషన్‌కార్డులకు ‘స్థానిక’ భయం! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డులకు ‘స్థానిక’ భయం!

Jul 25 2025 4:25 AM | Updated on Jul 25 2025 4:25 AM

రేషన్

రేషన్‌కార్డులకు ‘స్థానిక’ భయం!

సుభాష్‌నగర్‌: అర్హులందరికీ రేషన్‌కార్డులు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో పేదల్లో సంతోషం ఎంతోకాలం నిలిచేలా లేదు. కార్డుల కో సం దరఖాస్తు చేసుకున్న పేదలకు స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుంది. ఎన్నికల కోడ్‌ రూపంలో అడ్డుతగిలేలా ఉందనే చర్చ దరఖాస్తుదారుల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో 4,05,310 రేషన్‌ కా ర్డులు ఉన్నాయి. అందులో అంత్యోదయ కార్డులు 20,910, అన్నపూర్ణ కార్డులు 1,016 పోను మిగతా 3,83,384 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. గత జనవరి నుంచి ఇప్పటి వరకు 3,501 కొత్తకార్డులు మంజూరయ్యాయి. 1.19 లక్షల మంది పేర్లు కొత్తగా కార్డుల్లో చేరాయి. కాగా, రేషన్‌కార్డుల కో సం 39వేల వరకు దరఖాస్తులు రాగా, 20వేలకుపైగా దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల మీ సేవ కేంద్రాల్లో కార్డుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో పది రోజులపాటు వెబ్‌సైట్‌ను బంద్‌ ఉంచారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తహసీల్దార్‌ కుణ్ణంగా పరిశీలించిన తర్వాతే డీఎస్‌వో లాగిన్‌కు ఫార్వార్డ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో దరఖాస్తులపై రీసర్వే చేసి, నిబంధనల ప్రకారం ఉంటేనే డీఎస్‌వో లాగిన్‌కు ఫార్వార్డ్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే రిజెక్ట్‌ చేస్తున్నారు.

ఎన్నికల కోడ్‌పై సర్వత్రా చర్చ

దరఖాస్తుదారుల్లో మొదలైన ఆందోళన

తహసీల్‌, డీఎస్‌వో

కార్యాలయాలకు పరుగులు

కోడ్‌పై స్పష్టత లేదంటున్న అధికారులు

కోడ్‌ వర్తిస్తుందా?

రేషన్‌కార్డుల దరఖాస్తు, మంజూరు నిరంతర ప్రక్రియ అంటూ ప్రభుత్వ పెద్దలు ఒకవైపు ప్రకటనలు చేస్తున్నా.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌తో దరఖాస్తుల మంజూరు నిలిచిపోనుందా అనే చర్చ జోరందుకుంది. రేషన్‌కార్డుల మంజూరుకు స్థానిక సంస్థల కోడ్‌ వర్తిస్తుందా? లేదా? అనే దానిపై అటు అధికార వర్గాల్లో, ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టత కరువైంది. దీంతో గాబరా పడుతున్న దరఖాస్తుదారులు తహసీల్‌, డీఎస్‌వో కార్యాలయాలకు తరలివస్తున్నారు.

స్పష్టత లేదు..

రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లోగా మంజూరు చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ కార్డుల మంజూరుకు వర్తిస్తుందా? లేదా అనేది స్పష్టత లేదు. ప్రభుత్వ పరిధిలోని అంశం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ముందుకు సాగుతాం.

– అరవింద్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

రేషన్‌కార్డులకు ‘స్థానిక’ భయం!1
1/1

రేషన్‌కార్డులకు ‘స్థానిక’ భయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement