
ప్రభుత్వ స్కూళ్లల్లో లైబ్రరీ పీరియడ్
నిజామాబాద్‌అర్బన్: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని 252 హైస్కూళ్లు, 131 ప్రాథమికోన్నత పాఠశాలలకు వివిధ రకాల పుస్తకాలను సరఫరా చేసింది. దీంతో ప్రతిరోజు గ్రంథాలయ పీరియడ్ నిర్వహిస్తూ విద్యార్థులను బాల సాహిత్యానికి చేరువ చేయనున్నారు. అలాగే పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందిచనున్నారు.
నిర్వహణపై శిక్షణ
ఒక్కో పాఠశాలకు సమగ్ర శిక్ష అభియాన్ 150 పుస్తకాలు, రూమ్ టు రీడ్ సంస్థ 250 వరకు కథల పుస్తకాలను సరఫరా చేసింది. విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా రంగురంగుల బొమ్మలతో కూడినవి, నైతిక విలువలు పెంపొందించేవి, నీతి కథలు, నా యకుల జీవిత చరిత్రలు గల పుస్తకాలు ఉన్నాయి. కాగా, గ్రంథాలయాల నిర్వహణపై రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ ఇస్తున్నారు. వారు ఈ నెల 28, 29 తేదీలలో జరగనున్న కాంప్లెక్స్ సమావేశాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
రీడింగ్ కార్నర్‌లు..
గ్రంథాలయాల ఏర్పాటుతో పిల్లల్లో అభ్యసన స్థా యి మెరుగుపడుతున్నట్లు ఇటీవల ప్రకటించిన న్యాస్ ఫలితాలతో వెల్లడైంది. దీనిని దృష్టిలో పెట్టు కొని పఠన సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిరోజు లైబ్రరీ పీరియడ్ అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించనున్నారు. అలాగే విద్యార్థులు ఉత్సాహంగా, స్వేచ్ఛగా చదివేలా పాఠశాలలో 45 నిమిషాలు కే టాయించనున్నారు. అందుకు ప్రతి తరగతి గదిలో రీడింగ్ కార్నర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వారంలో రెండుసార్లు పిల్లలకు కథల పుస్తకాలను ఇంటికి ఇచ్చి చదివే అలవాటును ప్రోత్సహించనున్నారు.
ప్రతి రోజు 45 నిమిషాలు కేటాయింపు
జిల్లాలోని 383 పాఠశాలల్లో
అందుబాటులో గ్రంథాలయాలు
పఠనాసక్తి పెంపొందించడమే లక్ష్యం
రిసోర్స్ పర్సన్లకు కొనసాగుతున్న శిక్షణ
పఠనశక్తి పెరుగుతుంది
ప్రభుత్వ బడులకు సరఫరా చేసిన కథల పుస్తకాలు బాగున్నాయి. ఆకర్షణీయంగా ఉండడంతో పిల్లలు చదివేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో పిల్లల్లో పఠన శక్తి పెరుగుతుంది. – అశోక్, డీఈవో
చదవడం అలవాటుగా మారుతుంది
ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లలు సెల్‌ఫోన్‌లకు ఆకర్షితులవుతున్నా రు. ఈ దురాలవాటును మాన్పించడానికి పిల్లలు పుస్తకాలను చదివేలా లైబ్రరీ నిర్వహణ ఎంతగానో ఉపయోగపడుతుంది. – ప్రసన్న కుమార్,
రిసోర్స్ పర్సన్

ప్రభుత్వ స్కూళ్లల్లో లైబ్రరీ పీరియడ్

ప్రభుత్వ స్కూళ్లల్లో లైబ్రరీ పీరియడ్