
ఆర్థిక భారమైనా.. సన్నబియ్యం పంపిణీ
బోధన్ : ఉన్నతస్థాయి వారితో సమానంగా పేదలు సైతం సన్నబియ్యంతో భోజనం చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరిస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తోందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి ఆడిటోరియం హాల్, సాలూరాలోని టీటీడీ కల్యాణ మండపంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ మండలానికి చెందిన 665 మందికి, సాలూరాకు చెందిన 108 మందికి నూతన రేషన్‌కార్డులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు ఇస్తామన్నారు. పేదల అభ్యున్నతి, వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.22 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. అలాగే బోధన్ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా అధిక లాభదాయకమైన ఆయి ల్ పామ్ పంట సాగు వైపు దృష్టిసారించాలని రైతులకు సూచించారు. జిల్లాకు నాలుగైదు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారని, రూ.1000 కోట్ల వి లువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని తె లిపారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడు తూ.. అర్హులకు రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. జిల్లాలో 11,852 కొత్త రేషన్‌కార్డులు, 84,232 మంది కొత్త సభ్యుల పేర్లను జాబితాలో చే ర్చినట్లు వివరించారు.
సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, డీఎస్‌వో అర్వింద్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, సాలూర తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో శ్రీనివాస్, టీపీసీసీ డె లిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అఽ ద్యక్షుడు మందర్నా రవి, నాగేశ్వర్‌రావు, పాషామోహినొద్దీన్, సాలూర సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, నాయకులు అల్లె రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ రేషన్‌కార్డులిస్తాం
పకడ్బందీగా వెరిఫికేషన్
నాలుగైదు రోజుల్లో జిల్లాకు సీఎం రాక
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బోధన్, సాలూర మండలాల్లో
కార్డుల పంపిణీ
కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): రేషన్‌కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని నిజామాబా ద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కేఎన్‌ఆర్ గార్డెన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ..
రూరల్ నియోజకవర్గంలో 16,116, డిచ్‌పల్లి మండలంలో 3,270 రేషన్‌కార్డులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం పదేళ్ల కాలంలో ఒక్క రేషన్‌కార్డు కూడా మంజూరు చేయ లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలకు సన్న బియ్యం ఇవ్వ డం లేదని విమర్శించారు. అదనపు కలెక్టర్ కిర ణ్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, తహసీల్దా ర్ సతీశ్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి యోహాన్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ కే నగేశ్‌రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ తారాచంద్, డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, డీసీసీ డెలిగేట్స్ వాసుబా బు, ధర్మాగౌడ్, శ్యాంసన్, సొసైటీ చైర్మ న్లు రాంచందర్‌గౌడ్, గంగారెడ్డి, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, నర్సయ్య పాల్గొన్నారు.

ఆర్థిక భారమైనా.. సన్నబియ్యం పంపిణీ