
అందుబాటులో సరిపడా ఎరువులు
● రైతులు ఆందోళన చెందొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● ఎడపల్లి సొసైటీ ఎరువుల
గోదాం తనిఖీ
బోధన్ : వానాకాలం సీజన్ పంటల సాగుకు సరిప డా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారె డ్డి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఎరువుల గోదాంను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరు వుల కోసం వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడారు. సరిపడా ఎరువులు అందుతున్నాయా లేదా అని ఆ రా తీశారు. జిల్లాలో ప్రస్తుతం 11వేల మెట్రిక్ ట న్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రెండ్రోజులకు ఒకసారి ఎరువుల స్టాక్ వస్తోందన్నారు. రైతులకు ఎరువులు అందేలా ప్ర ణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నా రు. వరికి ప్రత్యామ్నాయంగా అధిక లాభాలు అందించే ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట సొసైటీ చైర్మ న్ పోల మల్కారెడ్డి, ఉద్యోగులున్నారు.
మరమ్మతులు చేయించాలి
పట్టణ కేంద్రంలోని బోధన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించారు. ఆస్పత్రి భవనం లీకేజీలు, ఫ్లోరింగ్ వంటి సమస్యలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్‌ను కలిసిన డేటా ఆపరేటర్లు
సాలూర మండల కేంద్రంలో కొత్తరేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కులగణన సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలిశారు. ప్రభుత్వం నుంచి పారితోషి కం ఇప్పించాలని కోరారు.