అభివృద్ధికి అడుగులు.. | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి అడుగులు..

Jul 26 2025 9:04 AM | Updated on Jul 26 2025 10:34 AM

నిజామాబాద్‌

ఏపీఎంల బదిలీలు పూర్తి

జిల్లాలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌)లో పనిచేస్తున్న ఏపీఎంల బదిలీలు పూర్తయ్యాయి.

శనివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2025

– 8లో u

వచ్చే వారంలో జిల్లాకు రానున్న సీఎం రేవంత్‌ !

రూ.వెయ్యి కోట్లకుపైగా అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రంగం సిద్ధం

మోడల్‌ స్కూళ్లు.. అమృత్‌ స్కీమ్‌లకు..

ప్రాణహిత – చేవెళ్ల పథకానికి నిధులు ప్రకటించే అవకాశం..

టీయూలో ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుపై చిగురిస్తున్న ఆశలు

పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే వారం జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. సుమారు రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. పామాయిల్‌ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు భారీగా పెరుగుతోంది. మరో ఏడాది తరువాత నుంచి జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో పామాయిల్‌ దిగుబడి చేతికి రానుంది. దీంతో క్రషింగ్‌ కోసం రెంజల్‌ మండలంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రీ యూనిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సుమారు రూ.100 కోట్ల వ్యయంతో ఫ్యాక్టరీ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నిజాం షుగర్స్‌ మూతపడిన తరువాత దెబ్బతిన్న ఎకానమీని పునరుద్ధరించే లక్ష్యంతో బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. చెరుకు సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తోంది. దీంతో జిల్లాలో పామాయిల్‌ సాగు రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే 6వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. వచ్చే ఏడాదికి 15వేల ఎకరాలకు పెరుగనుంది. నాలుగో ఏడాది నుంచి 30 ఏళ్ల వరకు పామాయిల్‌ దిగుబడి వస్తుంది. అదేవిధంగా నాలుగేళ్లవరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చు. దీంతో రైతులు ఆయిల్‌పామ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉండగా ఫ్యాక్టరీ నిర్మాణం చేయనున్న స్థలానికి ఇప్పటికే రోడ్డు వేయగా, సుదర్శన్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. సీఎం రేవంత్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రూ.600 కోట్లతో బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌ మండలాల్లోని మోడల్‌ స్కూళ్ల భవనాల నిర్మాణానికి, బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాల అమృత్‌ స్కీం పనులకు సైతం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

న్యూస్‌రీల్‌

21వ ప్యాకేజీకి నిధులు..

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ప్రా ణహిత–చేవెళ్ల 21వ ప్యాకేజీకి సంబంధించిన పనులకు ముఖ్యమంత్రి నిధులు ప్రకటించనున్నట్లు సమాచారం. మంచిప్ప ఏరియాలో ముంపు సమస్య లేకుండా 0.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతోనే గతంలో ప్రతిపాదించిన 2 లక్షల ఎకరాల ఆయకట్టు తగ్గకుండా నిర్మా ణం చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి తెలిపారు. మెంట్రాజ్‌పల్లి వరకు గ్రావిటీతో, గడ్కోల్‌కు లిఫ్ట్‌ ద్వారా నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కొత్తగా 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు, నిజాంసాగర్‌ టెయిల్‌ఎండ్‌ పరిధిలో 80వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సీఎం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇంజినీరింగ్‌ కళాశాల..

తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కేబినెట్‌ ఆమోదిస్తే ఈ ఏడాదే నాలుగు కోర్సులతో తరగతులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలను సైతం టీయూ పరిధిలోకి తీసుకువచ్చేలా సీఎంను కోరామన్నారు.

అభివృద్ధికి అడుగులు..1
1/2

అభివృద్ధికి అడుగులు..

అభివృద్ధికి అడుగులు..2
2/2

అభివృద్ధికి అడుగులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement