
గుండెపోటుతో ఇరిగేషన్ ఏఈఈ మృతి
కమ్మర్‌పల్లి : విధి నిర్వహణలో ఇరిగేషన్ ఏఈఈ నితిన్(30) శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ లోని రాళ్లవాగులో చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి తో టి సిబ్బందితో కలిసి లెవల్స్ తీస్తుండగా నితిన్ కుప్పకులాడు. సమాచారం అందుకున్న ఎస్సై అనిల్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహా న్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌కు చెందిన నితిన్ 2024 అక్టోబర్‌లో ఏఈఈగా ఉద్యోగం సాధించాడు. నెల రోజుల క్రితమే వివాహమైంది.