
పురాతన ఇళ్లపై నజర్
నిజామాబాద్ సిటీ : అసలే వానాకాలం.. ఆపై పురాతన భవనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కురుస్తున్న వర్షాలతో మట్టితో నిర్మించిన పాత ఇళ్లు తడుస్తూ కొద్దికొద్దిగా కూలుతున్నాయి. ఎ లాంటి ప్రమాదాలు చోటు చేసుకోకముందే బల్ది యా అధికారులు అప్రమత్తమయ్యారు. పురాత న (శిథిల) భవనాలపై దృష్టి సారించారు. కా ర్పొరేషన్ పరిధిలో కూలడానికి సిద్ధంగా 120 ఇళ్లను గుర్తించారు.
వందల సంఖ్యలో పురాతన ఇళ్లు..
కార్పొరేషన్‌లోని పాత ఇందూరులో పురాతన ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. దుబ్బ, బురుడుగల్లీ, కోటగల్లీ, శివాజీనగర్, వినాయక్‌నగర్, జెండాగల్లీ, గాజుల్‌పేట్, కంఠేశ్వర్, శివాజీనగర్, బ్రహ్మపురి కాలనీ, పూసలగల్లీ, బొబ్బిలి వీధి, కసాబ్‌గల్లీ, ఫులాంగ్, పెద్దబజార్, అర్సపల్లిల్లో వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే శిథిలావస్థకు చేరి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అయితే కొన్నింటిలో మాత్రం ఇప్పటికీ జనం నివసిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా సెంటిమెంట్‌తో వాటిని ఖాళీ చేయడం లేదు. గోడలకు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తూ వాటిలోనే నివసిస్తున్నారు. పెంకుటిళ్లు కూలిపోతున్నా పాలిథిన్, టార్పాలిన్లు కప్పుకొని అందులోనే నివసిస్తున్నారు.
ఖాళీ చేయాలి
నగరంలోని పురాతన ఇళ్లను గుర్తించాం. వరుసగా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు 120 ఇళ్లను గుర్తించాం. ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చాం. ప్రమాదం జరగక ముందే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. – టీ శ్రీనివాస్, ఏసీపీ
పాత ఇళ్లకు నోటీసులు..
నగరంలో ఉన్న పురాతన భవనాలను గు ర్తించి నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఆదేశించారు. దీంతో బల్దియా అధికారులు పాత భవనాలను గు ర్తించేపనిలో నిమగ్నమయ్యారు. టౌన్ ప్లా నింగ్ విభాగానికి చెందిన ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు టీపీఎస్‌లతోపాటు ఆరుగురు టీపీబీవోలు నగరంలో పర్యటిస్తూ పాత భవనాల ను గుర్తిస్తున్నారు. వెంటనే కూల్చివేయాల్సి న వాటి యజమానులకు నోటీసులు అందజేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అవగాహన కల్పిస్తున్నారు.
వర్షాల నేపథ్యంలో
బల్దియా అప్రమత్తం
నిజామాబాద్‌నగరంలో
120 శిథిల ఇళ్ల గుర్తింపు
కూల్చివేయాలని
యజమానులకు నోటీసులు
ఖాళీ చేయాలంటున్న అధికారులు

పురాతన ఇళ్లపై నజర్

పురాతన ఇళ్లపై నజర్