
మహిళలకు వడ్డీ వాపస్
డొంకేశ్వర్(ఆర్మూర్): స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వడ్డీ’ కానుక అందజే సింది. ఐకేపీలో బ్యాంకు లింకేజీ రుణాలు పొంది వడ్డీతో కలిపి సక్రమంగా వాయిదాలు చెల్లించిన వారికి వడ్డీ డబ్బులను వాపస్ చేసింది. జి ల్లాలోని 20,547 ఎస్‌హెచ్‌జీలకు రూ.21.69 కోట్లు విడుదల చేసింది. ఇవి 2024–25 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వడ్డీ డబ్బులని సంబంధిత అధికారులు వెల్లడించారు. నిధుల ను మండలాల వారీగా సంఘాల ఖాతాల్లో జ మ చేశారు. సంఘం ఖాతాల నుంచి సభ్యురాలి వారీగా వడ్డీ డబ్బులను పంచుకోనున్నారు. అ త్యధికంగా నందిపేట్ మండలానికి రూ.1.32 కోట్లు, నవీపేట్ మండలానికి రూ.1.24కోట్ల వడ్డీ వాపస్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వడ్డీ వాపస్ రావడంతో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
మండలాల వారీగా వాపస్ వచ్చిన వడ్డీ డబ్బులు
మండలం సంఘాలు రూ.కోట్లలో
ఆర్మూర్ 948 1.16
మాక్లూర్ 1,088 1.05
నందిపేట్ 1,220 1.32
బాల్కొండ 606 0.69
భీమ్‌గల్ 976 1.15
కమ్మర్‌పల్లి 845 1.06
మెండోరా 497 0.52
మోర్తాడ్ 666 0.62
ముప్కాల్ 411 0.52
ఎడపల్లి 854 0.85
ధర్పల్లి 809 0.82
డిచ్‌పల్లి 1,187 0.59
ఇందల్వాయి 682 0.59
జక్రాన్‌పల్లి 828 0.98
మోపాల్ 760 0.78
నిజామాబాద్‌రూరల్ 571 0.62
సిరికొండ 944 0.96
వేల్పూర్ 960 1.16
ఏర్గట్ల 335 0.37
చందూర్ 188 0.15
కోటగిరి 893 0.93
మోస్రా 267 0.25
రుద్రూర్ 416 0.41
వర్ని 554 0.49
బోధన్ 1,189 1.22
నవీపేట్ 1,145 1.24
రెంజల్ 708 0.61
జిల్లాకు రూ.21.69 కోట్లు విడుదల
ఎస్‌హెచ్‌జీల ఖాతాల్లో నిధులు జమ

మహిళలకు వడ్డీ వాపస్