ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.438 కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.438 కోట్లు

Jul 25 2025 4:25 AM | Updated on Jul 25 2025 4:25 AM

ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.438 కోట్లు

ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.438 కోట్లు

నిజామాబాద్‌నాగారం: ఉమ్మడి జిల్లా (నిజామాబాద్‌, కామారెడ్డి) పరిధిలో 362.83 కిలోమీటర్ల మేర 24 రోడ్ల పనులకు ప్రభుత్వం రూ.438.54 కో ట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులను ఆర్‌ అండ్‌ బీ పరిధిలో చేపట్టేందుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌(హ్యామ్‌) విధానంలో పనులు చేపట్టనున్నారు.

నూతన విధానమిదే..

గతంలో రోడ్లను ఈపీసీ (ఇంజినీరింగ్‌ – ప్రొక్యూర్‌మెంట్‌–కనస్ట్రక్షన్‌) లేదా బీవోటీ (బిల్డ్‌ – ఆపరేట్‌ – ట్రాన్స్‌ఫర్‌) విధానాల్లో చేపట్టేవారు. ఈపీసీ విధానంలో పనులు చేపడితే ప్రభుత్వం ఒకేసారి భారం పడగా, బీవోటీ విధానంలో కాంట్రాక్ట్‌ సంస్థనే మొ త్తం నిధులను భరించాల్సి వచ్చేది. బీవోటీ విధానంలో రోడ్లను నిర్మించిన కాంట్రాక్ట్‌ సంస్థ టోల్‌గేట్లను ఏర్పాటు చేసుకుని రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన మొత్తాన్ని రాబట్టుకునేది. అయితే ప్రభుత్వం, ప్రజలకు భారం తప్పేలా హ్యామ్‌ (హైబ్రిడ్‌ యా న్యునిటీ మోడ్‌) విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రోడ్డు కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థకు ప్రభుత్వం ముందుగా 40శాతం ని ధులు అందిస్తుంది. మిగతా 60శాతం నిధులను సదరు కాంట్రాక్ట్‌ సంస్థనే భరిస్తూ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్‌ సంస్థలు రోడ్ల ని ర్మాణానికి వెచ్చించిన 60శాతం నిధులను ప్రభు త్వం 15 ఏళ్లపాటు ఏటా కొంత చొప్పున వడ్డీతోపాటు చెల్లిస్తుంది. అయితే రోడ్ల నిర్వహణ బాధ్యత 15ఏళ్లపాటు కాంట్రాక్టర్‌దే. నూతనంగా తీసుకొచ్చిన హ్యామ్‌ విధానంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం, విస్తరణ చేపట్టాలనే నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసరం ఉన్న రోడ్లే..

ఉమ్మడి జిల్లా(కామారెడ్డి, నిజామాబాద్‌)లో అవసరం ఉన్న చోట్ల నూతన రోడ్ల నిర్మాణం, విస్తరణ చేపట్టనున్నారు. ఇప్పటికే 24 రోడ్లకు సంబంధించిన పనులను మొదటి ఫేజ్‌లో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 1438 కి.మీ, కామారెడ్డి జిల్లాలో 830 కిలో మీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. గ్రామీణ రోడ్లు, గ్రా మాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే, ఓ మండ లం నుంచి మరో మండలానికి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్ల పనులను ప్రాధాన్యతను బట్టి, ప్రజలకు అత్యంత అవసరం ఉన్న ప్రాంతాల్లో పనులను పకడ్బందీగా చేపట్టనున్నారు.

‘హ్యామ్‌’ విధానంలో

ఉమ్మడి జిల్లాలో పనులు

362.83 కిలోమీటర్ల మేర అత్యవసర పనులకు నిధుల కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement