
లక్ష్య సాధనకు కృషిచేయాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చే స్తూ, లక్ష్యాల సాధనకు ప్ర ణాళికాబద్దంగా కృషి చే యాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 51 లక్షల పైబడి మొ క్కలు నాటేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయనే వా తావరణ శాఖ చేసిన సూచనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులకు ఐకేపీ, మెప్మా ద్వారా రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నా రు. అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూ చించారు. క్షయ వ్యాధి నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలల పాటు పోషణ్ కిట్లు అందించేలా చొరవ చూపాలని సూచించారు. సీజనల్ వ్యాధుల ని యంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల, అంగన్‌వాడీ, పీహెచ్‌సీల భవనాలను త్వరితగతిన పూర్తి చేసి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి