
ఆర్మూర్ సబ్ కలెక్టర్‌గా అభిజ్ఞాన్ మాల్వియా
నిజామాబాద్ అర్బన్: ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా అభిజ్ఞాన్ మాల్వియా నియమితులయ్యా రు. శిక్షణలో ఉన్న 2023 బ్యాచ్ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లాలో శిక్షణలో ఉన్న ఐఏఎస్ అజ్మీరా సంకేత్‌కుమార్‌ను నిర్మల్ జిల్లా భైంసాకు సబ్ కలెక్టర్‌గా నియమించారు.
పటాన్‌చెరు – ఆదిలాబాద్ రైల్వేలైన్ మంజూరు
సుభాష్‌నగర్: నిజామాబాద్ పార్లమెంట్ ప రిధిలో రైల్వే విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్‌కు ముందడుగు పడింది. ఆర్మూర్ మీదుగా పటాన్‌చెరు – ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వేలైన్ వేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను పలుమార్లు కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు మంజూరైందని రైల్వే మంత్రి ఎంపీకి లేఖ రాశారు. డీపీఆర్ రూపొందిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని లే ఖలో పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో ము ఖ్యమైన రైల్వేలైన్ మంజూరు చేసినందు కు ఎంపీ అర్వింద్ కేంద్రమంత్రికి బుధవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.
పరిశ్రమల్లో తనిఖీలు
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులకు రాయితీపై అందిస్తున్న యూరియా పక్కదారి పట్టకుండా ప్రత్యేక టీములు రంగంలోకి దిగాయి. బుధవారం జిల్లాలోని పలుచోట్ల తనిఖీలు చేపట్టాయి. యూరియాను పలు పరిశ్రమల్లో వినియోగించే అవకాశం ఉండడంతో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల వివరాల కోసం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ ను ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. జిల్లా కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో ఏవో మహేందర్‌రెడ్డి, తహసీల్దార్ బాలరాజు, ఎస్సైలు ఉదయ్, గంగాధర్, ఆర్‌ఐ ప్రభాకర్ ఉన్నారు.
మత్స్య శాఖలో వసూళ్లపై ఆరా!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా మత్స్యశాఖలో వసూళ్ల తంతుపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నా యి. ఈ నెల 18, 23 తేదీల్లో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై ఉన్నతాధికారులు స్పందించి ఏడీ ఆంజనేయస్వామిని వివరణ కోరగా.. మరో పక్క ని ఘా వర్గాలు లోతైన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించాయి. ఏసీబీ సైతం మత్స్యశాఖపై నిఘా పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా బైలా పే రుతో వసూళ్లు, ముడుపులిస్తేనే చెరువుల లీ జు కథనాలు రాష్ట్ర మత్స్య శాఖ వర కు చేరా యి. వీటిపై వివరణ ఇవ్వాలని ఏడీ ని కమిషనర్ ఆదేశించారు. ఇటు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సైతం జవాబు రాసివ్వాలని ఏడీని అడిగినట్లు తెలిసింది. దీంతో ఆయన తనను తాను కాపాడుకునేలా వివరణ లేఖ ను కమిషనర్‌తోపాటు కలెక్టర్‌కు ఇచ్చినట్లు సమాచారం. పైగా మత్స్యకార సంఘాలపై నెపం వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఆర్మూర్ సబ్ కలెక్టర్‌గా అభిజ్ఞాన్ మాల్వియా