
మెరుగైన వైద్య సేవలందించాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకా న్ని పెంపొందించాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల పనితీరును వైద్యాధికారులతో సమీక్షించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్ వంద శాతం జరగాలని కలెక్టర్ సూచించారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులను నియంత్రించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ఎక్కడైనా విష జ్వరాలు సోకితే, పరిసర ప్రాంతాల వారికి కూడా రక్త పరీక్షలు నిర్వహించాలని, పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్ పక్కాగా జరిగేలా చూ డాలన్నారు. గురుకుల, వసతి గృహాల్లో విద్యార్థుల కు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సా ధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని తెలిపారు. అదనపు కలెక్టర్ అంకిత్, వైద్యారోగ్యశాఖ అదనపు డైరెక్టర్ అమర్‌సింగ్, డీఎంహెచ్‌వో రాజ శ్రీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్ పాల్గొన్నారు.
కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి