
ముగిసిన విచారణ
నిజామాబాద్‌నాగారం: సిరికొండ పీహెచ్‌సీ ఉద్యోగు లు పలువురు వి ధులకు హాజరుకాకుండా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్న వైనంపై ‘సాక్షి’లో మే 15వ తేదీన ‘విధులకు డుమ్మా.. రిజిస్టర్‌లో హాజరు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ వ్యవహారంపై వైద్యారోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేటీవ్ అడిషనల్ డైరెక్టర్ శశిశ్రీ మే నెల 17న సిరికొండ పీహెచ్‌సీకి వచ్చి విచారణ చేపట్టారు. నివేదికతో హైదరాబాద్‌కు వెళ్లారు. అప్పటి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో రాజశ్రీ సైతం విచారణ చేపట్టారు. ఆయా సందర్భాల్లో విచారణ సందర్భంగా డుమ్మా ఉద్యోగులకు ఎవరు సహకరిస్తున్నారు? ప్రతి నెలా ఎంత డబ్బు వసూలు చేశారు? ఏ ఉద్యోగి ప్రమేయం ఎంత వరకు ఉంది? అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం విధులకు డుమ్మా కొడుతూ జీతం తీసుకుంటున్న సీహెచ్‌వో వెంకటరమణపై మే 27న సస్పెన్షన్ వేటు వేశారు.
చర్యలు ఎన్నడో..?
సమగ్ర విచారణ నివేదికను డైరెక్టర్ ఆఫ్ హె ల్త్(డీహెచ్), ఉన్నతాధికారులతోపాటు జిల్లా కలెక్టర్‌కు డీఎంహెచ్‌వో అందజేశారు. ముగ్గు రు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందని విశ్వసనీయంగా తెలిసింది. విచార ణ నివేదిక జిల్లా, రాష్ట్ర అధికారుల చెంతకు చే రిన నేపథ్యంలో బాధ్యులపై ఏవిధమైన చర్యలు తీసుకుంటారు అనే దానిపై చర్చ జరుగుతోంది.
సిరికొండ పీహెచ్‌సీ ఉద్యోగుల
డుమ్మా వ్యవహారం..
ఉన్నతాధికారులకు అందిన నివేదిక
ప్రాథమిక విచారణ అనంతరం
సీహెచ్‌వో సస్పెన్షన్
ఉన్నతాధికారులకు విన్నవించాం
సిరికొండ పీహెచ్‌సీలో ఉద్యోగుల డుమ్మా వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారుల కు పంపించాం. జిల్లా కలెక్టర్ మారడంతో మళ్లీ ఫైల్ పంపించడం జరుగుతుంది. తప్పు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి. – రాజశ్రీ, డీఎంహెచ్‌వో

ముగిసిన విచారణ