
● జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన ఉందని పేర్కొంటూ నిజామాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించడంతో జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు, నది పరీవాహక ప్రాంతాలు, వాగుల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.