
వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలి
● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
ఆర్మూర్: చదువులతో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన గడ్డం సంతోష్ అనే ఇంటర్ విద్యార్థి రెండు రోజుల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో సోమవారం ఎమ్మెల్యే వసతి గృహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఉపాధ్యాయులు, సిబ్బంది, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించి వసతి గృహంలోని సౌకర్యాలను, విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట గురుకుల పాఠశాల సిబ్బంది ఉన్నారు.