
హడలెత్తిస్తున్న శునకాలు
నిజామాబాద్ సిటీ: బల్దియా పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజలను హడలెత్తిస్తున్నాయి. నగరంలో 20 వేల వరకు శునకాలున్నాయి. ఏబీసీ సెంటర్ నెలకొల్పినా అది నామమాత్రంగానే పనిచేస్తోంది. ప్రతి రోజు వీధుల్లో హల్‌చల్ చేస్తున్న కుక్కల్ని పట్టి వాటికి కు.ని. చేయాలి. కానీ, శానిటేషన్ అధికారులు ఆ ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వెంటనే వాక్సిన్ వేయించాలి..
కుక్కలు కాటువేసినా, గీరినా, వాటిగోళ్లు మన చర్మం మీద పడి రక్తం వచ్చినా వెంటనే ఏఆర్‌బీ వాక్సీన్ (యాంటీ రేబిస్ వాక్సిన్) వేయించాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగుసార్లు ఈవాక్సిన్ ఉచితంగా వేస్తారు. సరియైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే ప్రమాదముంది.
ఏబీసీ సెంటర్..
బల్దియా అధికారులు కుక్కల నియంత్రణకు యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్‌ను ఏర్పాటుచేశారు. దానికి శానిటరి ఇన్‌స్పెక్టర్ సాల్మన్‌రాజును ఇన్‌చార్జిగా నియమించారు. కుక్కలను బంధించే పనులను బజ్‌రంగ్ జవాన్‌కు అప్పగించారు. ప్రతి రోజు కుక్కలను బంధించి తీసుకువచ్చి వాటికి సంతానం కలగకుండా కుటుంబ నియంత్రణచేయడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. కు.ని కోసం ఓ ఏజెన్సీ టెండర్లు దక్కించుకుంది. కు.ని కార్యక్రమం మాత్రం సాఫీగా సాగడం లేదు. ఇప్పటివరకు వెయ్యికి పైగా కుక్కలకు కు.ని చేసినట్లు లెక్కల్లో ఉన్నా.. చాలా వాటికి కు.ని చేయలేదనే ఆరోపణలున్నాయి.
సాయినగర్‌లో తిరుగుతున్న కుక్కలు
వెంటపడుతున్నాయి
డ్యూటీ ముగించుకుని ఇంటకి వస్తుంటే కుక్కలు వెంటపడుతున్నాయి. గుంపులు గుంపులుగా రావడంతో కొన్నిసార్లు భయం అవుతోంది. బల్దియా అధికారులు వీధి కుక్కలను తీసుకెళ్లాలి. టోల్‌ఫ్రీ నెంబర్ ఇస్తే చాలా మంది ఫోన్‌లు చేసి సమాచారం అందిస్తారు. – గట్ల రాజు, శివాజీనగర్
త్వరలోనే ఏబీసీని పునరుద్ధరిస్తాం
కుక్కలను పట్టే కార్యక్రమం సాఫీగా సాగుతోంది. రోజు రాత్రి రెండు బృందాలు వెళ్లి కుక్కలను పట్టుకొస్తున్నాయి. జవాన్ బజ్‌రంగ్ ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. కుక్క కరిచినా, వాటిగోళ్లు మనకు పడినా వెంటనే వా క్సిన్ తీసుకోవాలి. అశ్రద్ధఽ చేయవద్దు. – సాల్మన్‌రాజు, శానిటరి ఇన్‌స్పెక్టర్, ఏబీసీ ఇన్‌చార్జి
నగరంలో గుంపులుగా
తిరుగుతున్న పరిస్థితి
రాత్రివేళ వెంటపడటంతో ప్రమాదాలబారిన పడుతున్న వాహనదారులు
సాఫీగా సాగని కుక్కల పట్టివేత
దృష్టిసారించని బల్దియా అధికారులు

హడలెత్తిస్తున్న శునకాలు

హడలెత్తిస్తున్న శునకాలు

హడలెత్తిస్తున్న శునకాలు