
బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కలుషితం చేయొద్దు
డొంకేశ్వర్: పచ్చికబయళ్లతో ఆహ్లాదాన్ని పంచుతున్న ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం చేయొద్దని ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రతినిధులు పర్యాటకులను కోరారు. ఆదివారం నవ్యభారతి గ్లోబాల్ స్కూల్ విద్యార్థులతో కలిసి డొంకేశ్వర్ మండలం చిన్నయానం బ్యాక్ వాటర్ వద్ద పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. బ్యాక్ వాటర్ ప్రాంతానికి సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలతో ప్రకృతిని పాడు చేయొద్దని కోరారు. ఈ సందర్భంగా చెత్త డబ్బాల ద్వారా చెత్తను సేకరించారు. పర్యాటకులకు ట్రాష్ బ్యాగులు అందజేసి అందులో వేయాలని సూచించారు. మాజీ ఎంపీటీసీ చిన్నారెడ్డి, సొసైటీ కార్యదర్శి సంతోష్ కుమార్, హీతెన్ భీమాని, స్కూల్ ప్రిన్సిపాల్ ఆంతోని, విద్యార్థులు పాల్గొన్నారు.
సాహిత్యంలో వరలక్ష్మికి డాక్టరేట్
డొంకేశ్వర్(ఆర్మూర్): సాహిత్యంలో రాణిస్తున్న డొంకేశ్వర్ మండలం తొండాకూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్ వరలక్ష్మికి డాక్టరేట్ లభించింది. కరీంనగర్‌లో ఆదివారం జరిగిన జాతీయస్థాయి భారత్ విభూషణ్–2025 అవార్డుల ప్రదానోత్సవంలో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను అందజేసింది. డాక్టరేట్‌ను అందజేసి ప్రోత్సహించిన యూనివర్సిటీకి ఈ సందర్భంగా వరలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
నిధులు మంజూరు చేయండి
మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టబోయే పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి సునీల్‌రెడ్డి కోరారు. సీఎం హైదరాబాద్‌లోని తన నివాసంలో సునీల్‌రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని జాబితా అందించారు. దీనికి స్పందించిన సీఎం నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు

బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కలుషితం చేయొద్దు

బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కలుషితం చేయొద్దు